ETV Bharat / city

కార్మిక విధానాలు వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల నిరసన

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్మిక విధానాలను వ్యతిరేకిస్తూ విజయవాడ ధర్నా చౌక్​ వద్ద కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. లాక్​డౌన్​లో ఉపాధి కోల్పోయిన కార్మికులందరికీ రూ.15 వేలు ఇవ్వాలని వివిధ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్​ చేశారు. అయితే ర్యాలీకి అనుమతి లేదని కార్మిక సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

all india trade union protest against government policy of state and central at dharna chowk
విజయవాడలో అన్ని కార్మిక సంఘాల నిరసన
author img

By

Published : Jul 4, 2020, 10:25 AM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్మిక విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త నిరసనలో భాగంగా విజయవాడ ధర్నా ఛౌక్​ వద్ద అన్ని కార్మిక సంఘాలు నిరసన ర్యాలీ చేపట్టాయి. కరోనా కాలంలో ఉపాధి కోల్పోయిన కార్మికులందరికీ రూ.15 వేలు ఇవ్వాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్​ చేశారు. పనిగంటల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. అలాగే ఉద్యోగుల జీతాల్లో కోతలు సరికాదని అన్నారు. రైల్వేలో ప్రైవేటు రంగాల పెట్టుబడుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు.

అయితే కార్మిక సంఘాల ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు వీరిని అడ్డుకున్నారు. కార్మిక సంఘాల నేతలను అరెస్ట్​ చేసి స్టేషన్​కు తరలించారు.

ఇదీ చదవండి..

ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కదిరిలో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.