ఆర్టీసీలో దశాబ్దాలుగా పనిచేస్తున్న ఒప్పంద కార్మికులను కొనసాగించాలని, వేతన బకాయిలు చెల్లించాలంటూ విజయవాడలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఒప్పంద కార్మికులు ఆందోళన చేపట్టారు. ఎన్నికల ముందు ఆర్టీసీ ఒప్పంద కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలంటూ డిమాండ్ చేశారు. రవాణా శాఖా మంత్రి ,ఆర్టీసీ ఎండీలు ఉద్యోగులను తీసివేయలేదని అబద్ధాలు చెబుతున్నారంటూ ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓబులేశు మండిపడ్డారు. ఆన్లైన్ విధానంతో వేలాది కండక్టర్ల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందన్నారు.
ఇదీ చదవండి : 'కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించడం లేదు'