కొవిడ్‌తో అగ్రిగోల్డ్ డైరెక్టర్లలో ఒకరైన సవడం శ్రీనివాస్ ( 52 ) మృతి చెందారు . అయోధ్యనగర్ లోటస్ ల్యాండ్ మార్క్‌కు చెందిన శ్రీనివాస్ కు కరోనా సోకటంతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. వారం రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించటంతో మృతి చెందారని సన్నిహితులు వెల్లడించారు . ఆయనకు భార్య , కుమారుడు , కుమార్తె ఉన్నారు. అగ్రిగోల్డ్ సంస్థలో మొత్తం 150 మంది వరకు వివిధ విభాగాల్లో డైరక్టర్లుగా ఉండగా వీరిలో శ్రీనివాస్ ఒకరు. ఇప్పటికే వివిధ కారణాలతో అగ్రిగోల్డ్ డైరెక్టర్లు ముగ్గురు మృతి చెందారు .
ఇదీ చదవండి: రాష్ట్రంలో మళ్లీ కొవిడ్ కేర్ సెంటర్లు: అనిల్ సింఘాల్