గండికోట జలాశయం ముంపు బాధితులు ఇచ్చిన అఫిడవిట్లను కోర్టుకు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాల్లో తీర్పును వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్, జస్టిన్ డి.రమేశ్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు అదే శాలిచ్చింది. తాళ్ల ప్రొద్దుటూరు, తదితర గ్రామాలకు చెందిన గండికోట జలాశయ ముంపు బాధితులకు పూర్తి పరిహారం చెల్లించకపోవడాన్ని సవాలు చేస్తూ... విశాఖకు చెందిన సామాజిక ఉద్యమకారుడు బొలిశెట్టి సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఇళ్లను ఖాళీ చేయించడానికి ఆరు నెలల సమయం ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ మరికొందరు వ్యాజ్యాలు వేశారు. రిజర్వాయర్‌ను పూర్తిగా నీటితో నింపి ఇళ్లను మునిగేలా చేసి ఖాళీ చేయించేందుకు అధికారులు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కె.జగన్ మోహన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ... పూర్తి స్థాయి పరిహారం అందజేశారన్నారు. ప్రభుత్వం చెల్లించిన పరిహారంతో సంతృప్తి చెందినట్లు నిర్వాసితులు అఫిడవిట్లు ఇచ్చారన్నారు. వాటిని తమ ముందు ఉంచాలని హైకోర్టు స్పష్టం చేసింది.
ఇదీ చదవండి:
కలుషిత నీరే కారణం కావొచ్చు : ఎయిమ్స్ సూపరింటెండెంట్ డా.రాజేష్ కక్కర్