రైల్వే ప్రయాణికుల ఆరోగ్య పరిరక్షణ కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రైల్వే స్టేషన్లు, రైళ్లలో కరోనా వైరస్ వ్యాప్తి, నివారణకు అధునాతన స్కానర్లు ఏర్పాటు చేస్తోంది. విజయవాడలోని రైల్వే స్టేషన్లో శానిటైజేషన్, స్కానింగ్‌తో కూడిన అధునాతన కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు లోపలికి వెళ్లే స్టేషన్ తూర్పు బుకింగ్ కార్యాలయం సమీపంలో దీన్ని ఏర్పాటు చేశారు.
లగేజీ బ్యాగ్‌లపై శక్తి వంతమైన ఆల్ట్రా వైలట్ కిరణాలును ప్రసరింప జేయడం ద్వారా కరోనా వైరస్‌ను నిర్మూలించేలా దీన్ని రూపొందించారు. దీనికి నామమాత్రపు ఫీజును నిర్ణయించారు. శానిటేషన్ కోసం 25 కేజీల లోపు బ్యాగ్ స్కానింగ్‌కు రూ.10, ఆ పైన బరువున్న వాటికి రూ.20 రుసుముగా నిర్ణయించారు. ఆల్ట్రా వైలట్ కిరణాలతో స్కానింగ్ కోసం 25కేజీల లోపు బ్యాగ్‌కు రూ.50, ఆ పైన బరువున్న వాటికి రూ.70 రుసుముగా నిర్ణయించారు.
ఇదీ చదవండి: 'మీకు దిక్కున్న చోట చెప్పుకోమంటున్నారు'