ETV Bharat / city

'మద్యం మత్తులో బ్లేడ్​తో రణరంగం సృష్టించినవారిపై చర్యలు తీసుకుంటాం' - ఏపీ క్రైమ్ న్యూస్

విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ అరాచకం సృష్టించింది. నలుగురి మధ్య తలెత్తిన విభేదాలతో బ్లేడ్​లతో దాడి చేసుకున్నారు. అందులో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఓ రౌడీషీటర్ తో పాటు మరో ఇద్దరు నిందితులున్నారని వారిపై చర్యలు తీసుకుంటామని ఏడీసీపీ లక్ష్మీపతి తెలిపారు.

ADCP On Blade Attack
ADCP On Blade Attack
author img

By

Published : Apr 3, 2021, 9:28 AM IST

'మద్యం మత్తులో బ్లేడ్​తో రణరంగం సృష్టించినవారిపై చర్యలు తీసుకుంటాం'

విజయవాడలో వంద రూపాయల కోసం నలుగురు మధ్య రేగిన వివాదం హత్యకు దారితీసింది. మద్యం మత్తులో బ్లేడ్​తో రణరంగం సృష్టించారు. అజిత్ సింగ్​నగర్​లో దినసరి వేతనం పంపిణీలో నలుగురి మధ్య తేడా వచ్చింది. ప్రశ్నించిన నాగరాజు పై మిగిలిన ముగ్గరు బ్లేడ్​తో దాడికి దిగారు. ఈ ఘటనలో ఓ రౌడీషీటర్ తో పాటు మరో ఇద్దరు నిందితులున్నారు. వారిని అరెస్ట్ చేసి వారిపై రౌడీషీట్ నమోదు చేస్తామని చెపుతున్న ఏడీసీపీ లక్ష్మీపతితో మా ప్రతినిధి ముఖాముఖి.

ఇదీ చదవండి:

స్టార్ క్యాంపెనర్లతో వేడెక్కనున్న తిరుపతి లోక్​సభ ఉపపోరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.