స్వేచ్ఛాయుత ఎన్నికలంటే మంత్రి పెద్దిరెడ్డికి ఎందుకు భయమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిలదీశారు. స్వేచ్ఛగా పంచాయతీ ఎన్నికలు జరిగితే వైకాపాకు ప్రజలు బుద్ధి చెబుతారనే భయంతోనే కనకరాజన్‌ను ఎస్ఈసీగా తీసుకొచ్చారని విమర్శించారు. వైకాపాకు ప్రజాబలం ఉంటే నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్‌కు ఉద్యోగులు సహకరించరని పెద్దిరెడ్డి మాట్లాడటం రాజ్యాంగ విరుద్ధమన్నారు.
వైకాపా ఉద్యోగ వ్యతిరేక విధానాల ముందు కరోనా వైరస్ ప్రభావం ఎంత అని ఎద్దేవా చేశారు. కరోనా వ్యాక్సిన్ కుంటి సాకు మాత్రమేనన్న ఆయన...,స్వేచ్ఛాయుత ఎన్నికలంటే వైకాపాకు జ్వరం పట్టుకొన్నట్లుగా ఉందన్నారు. రాజ్యాంగం, న్యాయస్థానాల తీర్పుల్ని ధిక్కరించే వారిపై ఎన్నికల కమిషన్, గవర్నర్ చర్యలు తీసుకొని రాజ్యాంగ సంక్షోభాన్ని నివారించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
ఇదీచదవండి