రాష్ట్రంలో వివిధ కారణాలతో ఎన్నికలు జరగని(local body elections) కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలు, ఎంపీటీసీ ,జడ్పీటీసీ స్థానాలు, గ్రామ పంచాయతీల్లోని సర్పంచులు, వార్డు మెంబర్ల ఎన్నికలు.. ఈ నెల 14 నుంచి 16 వరకు జరగనున్నాయి. దానికి సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. 498 పంచాయతీల్లోని 69 సర్పంచ్, 533 వార్డు పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. వివిధ కారణాలతో ఆగిన, ఖాళీ అయిన 187 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు.
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిపేందుకు ప్రకటన జారీ చేసింది. గ్రేటర్ విశాఖలో రెండు డివిజన్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు 12 మున్సిపాల్టీల్లోని 13 వార్డులకు, 6 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని 10 డివిజన్లకు పోలింగ్ జరగనుంది. ఎన్నికలు జరగని 338 మండలాల్లోని మొత్తం 498 గ్రామ పంచాయతీల పరిధిలోని 69 సర్పంచ్ పదవులకు, 533 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చదవండి:
AP Local Body Elections: ఆ స్థానాలకు నోటిఫికేషన్.. అమల్లోకి ఎన్నికల కోడ్