విషాద ఘటనల్లో బాధిత కుటుంబాలను వారి వద్దకు వెళ్లి పరామర్శించడం సంస్కారమని, కాని బాధిత కుటుంబాన్ని తన వద్దకే పిలిపించుకోవడంతో సీఎం జగన్ అహంకార ధోరణి తెలుస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నాగుల్‌మీరా విమర్శించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్ సలాం కుటుంబాన్ని.. అక్కడికి వెళ్లి కనీసం పరామర్శించలేదని ఆక్షేపించారు. అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి నేతృత్వంలో చేపట్టిన ఛలో అసెంబ్లీకి తెదేపా పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య వెనుక ఎవరున్నారో బయటికి రావాలంటే సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ...