ETV Bharat / city

వైకాపా ఎమ్మెల్యే అమర్నాథ్​పై.. పరువు నష్టం దావా వేస్తా: ఏబీవీ - గుడివాడ అమర్నాథ్ న్యూస్

పెగాసస్ వ్యవహారంలో వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తనపై చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తానని ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. అమర్నాథ్ వ్యాఖ్యలకు ఆధారాలు ఉంటే ప్రభుత్వానికి ఇవ్వొచ్చునని వెల్లడించిన ఆయన.. అవి ఆధారాల్లేని ఆరోపణలని అందరికీ అర్థమవుతోందన్నారు.

ఏబీ వెంకటేశ్వరరావు
ఏబీ వెంకటేశ్వరరావు
author img

By

Published : Mar 23, 2022, 3:24 PM IST

పెగాసస్ వ్యవహారంలో వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌ తన మీద చేసిన ఆరోపణలపై.. ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు. అమర్నాథ్‌ వ్యాఖ్యలకు ఆధారాలు ఉంటే.. ప్రభుత్వానికి ఇవ్వొచ్చని సూచించారు. అమర్నాథ్‌ వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేస్తానని ఆయన ప్రకటించారు. ఆయనవి ఆధారాల్లేని ఆరోపణలని అందరికీ తెలుస్తోందని వ్యాఖ్యానించారు. పలువురిపై పరువునష్టం దావా వేస్తున్నట్లు.. ఇప్పటికే ప్రకటించిన ఏబీ వెంకటేశ్వరరావు తాజాగా తనపై ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌పైనా దావా వేస్తున్నట్లు పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

అమర్నాథ్ ఏమన్నారంటే : పెగాసెస్ స్పైవేర్ వ్యవహారంలో.. ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయని వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఏబీ వెంకటేశ్వరరావుది ఇండియన్ పోలీసు సర్వీసు కాదని.. ఇజ్రాయెలీ పెగాసెస్ సర్వీసు అని ఎద్దేవా చేశారు. మమతా బెనర్జీ ఎలాంటి వ్యాఖ్యలూ చేయకపోతే.. నారా లోకేష్ ఎందుకు తడబడుతున్నారని ప్రశ్నించారు.

నిఘా సాఫ్ట్‌వేర్‌ను వాడుతున్నాం: తమ ప్రభుత్వం నిఘా సాఫ్ట్‌వేర్‌ను వాడుతోందని అమర్నాథ్‌ స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర ప్రయోజనాలు.. రాష్ట్ర భద్రత కోసమే నిఘా వ్యవస్థల్ని వినియోగిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు వ్యక్తిగత అంశాలు తెలుసుకునేందుకు కాదని చెప్పారు.

ఇదీ చదవండి :
MLA Amarnath: నిఘా సాఫ్ట్‌వేర్‌ను మా ప్రభుత్వం వాడుతోంది: గుడివాడ అమర్నాథ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.