ETV Bharat / city

అన్నీ తానై తల కొరివి పెట్టిన భార్య - భర్త అంత్య క్రియలు నిర్వహించిన భార్య

ఏడడుగులు నడిచిన భార్య అన్నీ తానై భర్త అంతిమయాత్రలో పాల్గొంది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు లాక్​డౌన్​ వల్ల తండ్రికి తలకొరివి పెట్టడానికి రాలేని పరిస్థితిలో... ఆమె భర్త మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది. పొంగుకొస్తున్న దుఖం దిగమింగుకుని చితికి నిప్పుపెట్టింది.

అన్నీతానై తల కొరివి పెట్టిన భార్య
అన్నీతానై తల కొరివి పెట్టిన భార్య
author img

By

Published : Apr 12, 2020, 8:12 PM IST

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిల్లకు చెందిన వెల్దండి రాములు నిన్న అర్ధరాత్రి అనారోగ్యంతో కన్నుమూశాడు. ఉపాధి కోసం గుజరాత్ వెళ్లిన ఒక్కగానొక్క కొడుకు లాక్​డౌన్​ కారణంగా తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేని పరిస్థితి.

భర్త అంత్యక్రియలు నిర్వహించడానికి చేతిలో చిల్లిగవ్వలేక రోదిస్తున్న మృతుడి భార్య లసులమ్మ కన్నీరు... చూపరుల హృదయాలను కలిచివేసింది. కొందరు ముందుకొచ్చి తలా కొంత వేసుకుని ఆమెతో తలకొరివి పెట్టించారు. తండ్రి చివరి చూపు నోచుకోని మృతుని కుమారుడు కనకయ్య లైవ్​ వీడియోలో తండ్రి అంత్యక్రియలు చూసి కన్నీటి పర్యంతమయ్యాడు.

అన్నీతానై తల కొరివి పెట్టిన భార్య

ఇదీ చదవండి: ఈ పిల్లాడు ప్రపంచాన్ని చూసి నవ్వుకుంటున్నాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.