రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కాం కేసు నుంచి మంత్రి గుమ్మనూరు జయరాం కుమారుడిని రక్షించేందుకు అచ్చెన్నాయుడుని ఆధారాలు లేకపోయినా అరెస్టు చేశారని టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రఘురామరాజు ఆరోపించారు. ఈఎస్ఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి జయరాంను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ.... విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
వేలకోట్ల అవినీతి ఆరోపణలు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి... తామేమీ తక్కువ కాదని కేబినెట్లోని మంత్రులు కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తక్షణమే మంత్రి జయరాం కుమారుడిపై విచారణ జరిపించాలని....లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని తమ నిరసన కార్యక్రమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: ఆ బెంజ్ కారు.. మంత్రి ఇంట్లోనే ఉంది: అయ్యన్నపాత్రుడు