తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలో స్థిరపడ్డ కిష్టమ్మకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఎవరూ సాకకపోవడంతో కిష్టమ్మ పండు వయసులో బిచ్చమెత్తుకుని జీవనం సాగిస్తోంది. అలా 40 వేల రూపాయలు కూడబెట్టింది. ఈ మధ్య ఆరోగ్యం బాగాలేక పోవడం వల్ల ఆ డబ్బుతో తనను ఆస్పత్రిలో చూపించమని కొడుకుని అడిగింది.
దవాఖానాకు తీసుకెళ్తానని తల్లిని నమ్మించిన ఆ కొడుకు... తన భార్యతో తల్లిని పంపించాడు. కిష్టమ్మ వద్ద ఉన్న చిరునామా కాగితాలను తీసుకున్న కోడలు ఆమెను భువనగిరి బస్టాండ్ సమీపంలో వదిలి వెళ్లింది. కుమారుడి కోసం దీనంగా ఎదురుచూస్తున్న వృద్ధురాలిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు కిష్టమ్మకు వైద్య చికిత్సలు చేయించేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం అమ్మ ఒడి ఆశ్రమానికి తరలించనున్నారు.
ఇదీ చూడండి: శ్రీలంక మత్స్యకారులను కాపాడిన భారత కోస్ట్‌గార్డ్స్