విజయవాడ ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డులో ఆగి ఉన్న లారీలో మంటలు చెలరేగాయి. టైర్ల లోడుతో రాయనిపాడు నుంచి రాజమహేంద్రవరానికి వెళ్తున్న లారీలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో లారీలోని టైర్లు మంటలకు ఆహుతయ్యాయి. లారీకి కొంచెం ఎత్తులోనే విద్యుత్తు వైర్లు ఉండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి