ETV Bharat / city

ప్లాస్టిక్ వాడొద్దంటూ ఈ - ఎఫ్​ఎం అవగాహన - ఈ-ఎఫ్‌ఎం ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం

ప్లాస్టిక్‌ వినియోగం వల్ల పర్యావరణానికి తీవ్రమైన హాని కలుగుతుందని తెలిసినా...ఇంకా వాడుతూనే ఉన్నారు. ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గంచడం, మొక్కలు పెంచడంపై ఆసక్తి కలిగించడం కోసం విజయవాడలో.... ఈ ఎఫ్ఎం ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం చేపట్టారు. ప్లాస్టిక్‌ వల్ల కలిగే అనర్థాలు వివరిస్తూ..మొక్కలను పంపిణీ చేశారు.

ఈ-ఎఫ్‌ఎం ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం
ఈ-ఎఫ్‌ఎం ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం
author img

By

Published : Dec 9, 2019, 4:25 PM IST

ప్లాస్టిక్​ నివారణపై ఈ-ఎఫ్‌ఎం ఆధ్వర్యంలో ప్రచారం

సరాగాల సంగీతంతోపాటు... పసందైన కార్యక్రమాలతో శ్రోతలను అలరిస్తోన్న ఈ - ఎఫ్​ఎం మీ ఎఫ్​ఎం 91.9...ప్లాస్టిక్‌ నియంత్రణపై ప్రచారం మొదలుపెట్టింది. సామాజిక బాధ్యతగా మొక్కలు పెంపకంపై అవగాహన కల్పిస్తోంది. ప్లాస్టిక్‌ రహిత విజయవాడ, గుంటూరు పేరుతో ఈ - ఎఫ్​ఎం బృందం విజయవాడ వీధుల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించింది. ప్లాస్టిక్‌ వాడకం తగ్గించాలని చెబుతూ... మొక్కలు పెంచాలని సూచించింది.

ప్లాస్టిక్​ ఇస్తే మొక్కల పంపిణీ

ఈ కార్యక్రమంలో భాగంగా... ఇంట్లోని ప్లాస్టిక్‌ వస్తువులు ఇచ్చిన వారికి ఈ - ఎఫ్​ఎం సిబ్బంది మొక్కలు పంపిణీ చేశారు. ఒక కిలో ప్లాస్టిక్‌కు ఒక మొక్క చొప్పున పంపిణీ చేశారు. ఆయా కాలనీల్లో ప్రజలు మొక్కలు పెంచేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చారు. ఇంట్లో ఉపయోగించే ప్లాస్టిక్‌ సీసాలు, కవర్లు అందజేసి మొక్కలు తీసుకున్నారు. తప్పనిసరిగా ప్లాస్టిక్‌ వినియోగం తగ్గిస్తామన్నారు. ఈ ఎఫ్​ఎం చేపట్టిన ప్రచార కార్యక్రమాన్ని ప్రజలు అభినందించారు.

ఇదీ చదవండి:

12 ఏళ్ల తర్వాత.. ఇంటికి చేరిన కన్నప్రేమ

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.