ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9pm

.

TOPNEWS
ప్రధాన వార్తలు @ 9pm
author img

By

Published : Jul 1, 2021, 8:59 PM IST

  • తెలుగు రాష్టాల మధ్య జలవివాదం

తెలుగురాష్ట్రాల మధ్య మళ్లీ జలవివాద పరిస్థితులు తలెత్తాయి. నాగార్జునసాగర్, పులిచింతలప్రాజెక్టుల వద్ద పోలీసుల మోహరింపుంతో...ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. ఏపీ అనుమతి లేకుండానే తెలంగాణ జెన్​కో...విద్యుదుత్పత్తి ప్రారంభించటంతో వివాదం మొదలైంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ప్రధానికి, జలశక్తి మంత్రికి లేఖలు

ఉభయ తెలుగురాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జల వివాదాల విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, జలవనరుల మంత్రి షెకావత్‌కు సీఎం జగన్ లేఖలు రాశారు. ఏపీ ప్రయోజనాలు దెబ్బతినేలా తెలంగాణ వ్యవహరిస్తోందని ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'ఆర్థిక భారం పడకుండా ఉండేందుకే'

పేద కుటుంబాలను ఆదుకునేందుకు వైఎస్ఆర్ బీమా పథకాన్ని.. వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. 2021–22 సంవత్సరానికి గాను.. రాష్ట్రంలో 1.32 కోట్ల పేద కుటుంబాలకు దాదాపు రూ.700 కోట్ల వ్యయంతో ఉచిత బీమా రక్షణ కల్పిస్తున్నట్లు సీఎం జగన్​ తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • విచారణ వాయిదా

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌(cm jagan) బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టు(cbi court)లో ఇవాళ విచారణ జరిగింది. రఘురామ దాఖలు చేసిన రిజాయిండర్‌పై లిఖితపూర్వక సమాధానం ఇస్తానన్న జగన్‌ అభ్యర్థనను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'వైద్యుల సేవలు భళా!'

కరోనాపై పోరులో వైద్యుల కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. మహమ్మారిపై విజయం సాధించడంలో వారి అనుభవాలు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. వైద్య రంగ బడ్జెట్​ను రెట్టింపు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • జులైలో వానలు దంచికొడతాయా?

జులై నెలలో నైరుతి రుతుపవనాల తీరుపై భారత వాతావరణ శాఖ అంచనాలు వెలువరించింది. ఈ నెలలో వర్షపాతం సాధారణంగానే ఉండొచ్చని పేర్కొంది. రెండో వారం తర్వాత వర్షాలు పుంజుకుంటాయని తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'ఏటా 24 కోట్ల టీకా డోసుల ఉత్పత్తే లక్ష్యం'

ఆగస్టు నుంచి తాము నెలకు కోటి కొవిడ్ టీకా డోసులు ఉత్పత్తి చేస్తామని జైడస్​ క్యాడిలా తెలిపింది. డిసెంబర్​ నాటికి ఈ సంఖ్యను 5 కోట్లకు పెంచుతామని చెప్పింది. ప్రపంచంలో కరోనావైరస్‌పై తొలి డీఎన్‌ఏ టీకా తమదేనని పేర్కొంది. టీకాకు అనుమతులు వచ్చాక ఉత్పత్తిని ఏటా 24 కోట్ల డోసులకు పెంచాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • వాటికి ఆదాయం ఎలా?

వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్​లు వినియోగదారుల నుంచి ఎలాంటి ఛార్జీలు తీసుకోవు. అందులో ప్రకటనలు కూడా రావు. ఈ ఉచిత మెసేజింగ్ సేవల వల్ల వాటికి లాభమేంటి? రోజు వారీ కార్యకలాపాల కోసం కావాల్సిన నిధులు ఏ విధంగా సమకూరుతాయి? పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • వాన్ పై మండిపడుతోన్న ఫ్యాన్స్

ఇంగ్లాండ్‌ మాజీ సారథి మైకేల్‌ వాన్‌ మరోసారి టీమ్‌ఇండియాను ఎగతాళి చేశాడు! మహిళల క్రికెట్‌ జట్టును ప్రశంసిస్తూ కోహ్లీసేనపై వెటకారం గుప్పించాడు. కనీసం ఒక భారత జట్టైనా ఇంగ్లాండ్‌ పరిస్థితుల్లో పోరాడుతోందని ట్వీట్‌ చేశాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • డ్రగ్స్‌ కేసు విచారణ

సినీ ప్రముఖుల డ్రగ్స్‌ కేసు (Drugs Case)ను నాంపల్లి కోర్టు విచారణకు స్వీకరించింది. ఎక్సైజ్‌ సిట్‌ సమర్పించిన అభియోగపత్రాలను న్యాయస్థానం ఆమోదించింది. 4 సంవత్సరాల తర్వాత ఈ కేసులో విచారణ మొదలుకానుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.