- ఎన్నికల ఏర్పాట్లన్నీ సక్రమంగా జరుగుతున్నాయి: ఎస్ఈసీ
సుప్రీంకోర్టు ఎస్‌ఈసీని సమర్థించిన విషయాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు తెలిపానని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లన్నీ సక్రమంగా జరుగుతున్నాయన్నారు. ఎస్‌ఈసీపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయరాదని సుప్రీంకోర్టు చెప్పిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సంయమనంతో మాట్లాడాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇళ్ల స్థలాల కేటాయింపు, పంపిణీ నిరంతర ప్రక్రియ: సీఎం జగన్
రాష్ట్రంలో పేదలకు పట్టాల పంపిణీని మరో మూడు రోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇంటిస్థలం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ 90 రోజుల్లో ఇంటి పట్టా అందివ్వాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సీఎంగా ఉండటానికి జగన్‌రెడ్డి అనర్హుడు: చంద్రబాబు
గ్రామాల్లో యథేచ్ఛగా దోపిడీ చేసేందుకే వైకాపా ఏకగ్రీవాల జపం చేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అయన ... ఎప్పుడో 10 నెలల క్రితం ఇచ్చిన జీవోకు ఇప్పుడు ఫుల్ పేజీ యాడ్స్ ఇవ్వడం మరో తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జంట హత్యల కేసు: వెలుగులోకి కొత్త నిజాలు..
సంచలనం రేపిన మదనపల్లె జంట హత్యల కేసులో కీలకాంశం వెలుగులోకి వచ్చింది. పెద్దకుమార్తె అలేఖ్యకు పునర్జన్మలపై ఉన్న మూఢ నమ్మకమే.. దారుణానికి దారితీసింది. ఈ మేరకు పోలీసులు మదనపల్లె కోర్టుకు.... రిమాండ్ రిపోర్టు సమర్పించారు. మానసిక సమస్యతో బాధపడుతున్న నిందితులను తిరుపతి రుయాకు తరలించాలని భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ట్రాక్టర్ ర్యాలీ'తో రైతు ఉద్యమానికి బీటలు!
ట్రాక్టర్ ర్యాలీ నిరసనలతో దద్దరిల్లిన దిల్లీలో బుధవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. హింసాకాండకు సంబంధించి పోలీసులు 22 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మరోవైపు హింసాత్మక ఘటనలతో రైతు సంఘాల్లో చీలిక ఏర్పడినట్టు కనిపిస్తోంది. ఉద్యమం నుంచి రెండు రైతు సంఘాలు తప్పుకున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాష్ట్రాల సీఎస్‌లతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్సు
వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో.. ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పురోగతిపై సమీక్షించారు. కడప - బెంగళూరు బ్రాడ్‌గేజ్ రైల్వే నిర్మాణ పనులపై ప్రధాని ఆరా తీయగా.. ఏపీ, కర్ణాటక సీఎస్‌లు వివరాలు తెలియజేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జాతివివక్ష నిర్మూలనకు బైడెన్ కీలక నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతివివక్ష నిర్మూలనే లక్ష్యంగా మంగళవారం నాడు నాలుగు కీలక ఆదేశాలు జారీ చేశారు. జైళ్ల నిర్వహణపై ప్రైవేటు సంస్థలకు అనుమతి రద్దు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బస్సు, లారీ ఢీ- 53 మంది సజీవదహనం
మధ్యఆఫ్రికా దేశం కామెరూన్లో ఘోర ప్రమాదం జరిగింది. తీర ప్రాంత డౌలా నగరం నుంచి బఫౌసం వైపు వెళ్తున్న బస్సు.. శాంత్చౌ గ్రామం దగ్గర ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో 53 మంది మరణించగా.. 21మంది గాయపడ్డారు. స్థానికులు.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కోహ్లీ నంబర్ వన్- 2, 3లో రోహిత్, బుమ్రా
ఐసీసీ తాజా వన్డే ర్యాంకులు ప్రకటించింది. బ్యాటింగ్ విభాగంలో భారత కెప్టెన్, వైస్ కెప్టెన్లు తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఇక బౌలింగ్ విభాగంలో బుమ్రా మూడో స్థానంలో ఉన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కుప్పకూలిన మార్కెట్లు- 47,500 దిగువకు సెన్సెక్స్
స్టాక్ మార్కెట్లపై మరోసారి బేర్ పంజా విసిరింది. బుధవారం సెషన్లో సెన్సెక్స్, నిఫ్టీ సుమారు 2 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి. దాదాపు అన్ని రంగాలు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవడం, కేంద్ర బడ్జెట్ ముందు నెలకొన్న భయాలు సహా పలు ఇతర అంశాలు నష్టాలకు కారణమయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ప్రధాన వార్తలు @ 9PM - ap top ten news
.

ప్రధాన వార్తలు @9PM