- చలో గుంటూరు జైలు..
రాజధాని పరిరక్షణ సమితి ఐకాస చలో గుంటూరు జైలుకు పిలుపునిచ్చింది. రైతులకు సంకెళ్లు వేయడంపై అమరావతి ఐకాస, తెదేపా ఆందోళన చేయాలని నిర్ణయించాయి. అయితే నేతలను రాజధాని ప్రాంతం నుంచి గుంటూరు వెళ్లకుండా పోలీసులు కట్టడి చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- పోలవరం నిధుల్లో మరింత కోత?
పోలవరం ప్రాజెక్టు కట్టుబడికే తప్ప.. పునరావాసంతో సంబంధం లేదని ఇటీవలే బాంబు పేల్చిన కేంద్రం.. మరిన్ని నిధుల కోతకు సిద్ధమైంది. ప్రాజెక్టులో భాగంగా తాగునీటి సరఫరాతోపాటు విద్యుత్ కేంద్రం నిర్మాణానికి నిధులివ్వరాదని నిర్ణయించింది. ఆ మేరకు మొత్తం వ్యయంలో కోతపెట్టాలని కేంద్రజలశక్తి శాఖ నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- ముంబయి ఐఐటీలో చంద్రబాబు ప్రసంగం
తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు..ముంబయి ఐఐటీలో ఇవాళ ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఐఐటీకి చెందిన మేనేజ్మెంట్ విద్యార్థులనుద్దేశించి ప్రసంగం చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- బతికుండగానే చంపేశారు!
ఒకరి పేరుమీదున్న ఆస్తిని... వారు మృతిచెందినట్లు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి, సంతకాలు ఫోర్జరీ చేసి ఏకంగా రిజిస్ట్రేషన్ చేసేశారు అక్రమార్కులు. ఆ ఆస్తిని తిరిగి విక్రయించే క్రమంలో బయటకు తెలియడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించి గాజువాక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ ఉదంతం విశాఖలో బయటపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- హైటెక్ యుద్ధం
హైటెక్ సాంకేతికతను సమకూర్చుకోవడంపై దృష్టి సారించింది భారత సైన్యం. సైనిక కార్యకలపాలు, నిఘా, గూఢ చర్యం వంటి అంశాల్లో ఈ అధునాతన పరిజ్ఞానాలను ఉపయోగించేందుకు సిద్ధమవుతోంది. దిల్లీలో జరిగిన సైనిక కమాండర్ల సదస్సు (ఏసీసీ)లో ఈ అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- పాక్ ప్రకటనతో విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి
బిహార్ ఎన్నికల ప్రచారంలో.. విపక్షాలపై విమర్శలతో విరుచుకుపడ్డారు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్. పుల్వామా ఉగ్ర దాడిలో పాక్ ప్రమేయం ఉందని ఆ దేశ మంత్రి ప్రకటించడం వల్ల నిజానిజాలు బయటపడ్డాయని.. ఇది ప్రభుత్వ విమర్శకుల నోళ్లు మూయించిందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- 15వ ఆర్థిక సంఘం నివేదిక సిద్ధం
15వ ఆర్థిక సంఘం నివేదిక సిద్ధమైంది. అక్టోబర్ 30వ తేదీ నాటికి నివేదిక అందివ్వాల్సి ఉండగా ఆర్థిక సంఘం శుక్రవారం నాటికి తన పని పూర్తి చేసింది. ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయానికి చేరవేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి... వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఈ నివేదికను పార్లమెంటుకు సమర్పించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- కరోనాకు చెక్!
కొవిడ్ బారినపడకుండా రక్షణ కల్పించడంలో మాస్కులు కీలకంగా మారాయి. అందులో భాగంగానే వైరస్‌ను అంతమొందించే ఓ కొత్త రకం మాస్కును రూపొందిచారు అమెరికన్ పరిశోధకులు. యాంటీవైరల్ పొర కలిగిన ఈ మాస్కులు ధరించడం వల్ల.. వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని వారు అంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- షూటింగ్‌కు 'పుష్ప'రాజ్ పయనం
స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న కొత్త చిత్రం 'పుష్ప'. తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో నవంబరు 6 నుంచి ఈ సినిమా షూటింగ్ చేయనున్నారని సమాచారం. నెలరోజుల షెడ్యూల్లో కీలక సన్నివేశాలతో సహా ఓ పాటను తెరకెక్కించనున్నారని సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- తొలి వన్డే పాకిస్థాన్‌దే..
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో 26 పరుగుల తేడాతో పాకిస్థాన్ విజయం సాధించింది. పాక్ బౌలర్ల షహీన్, రియాజ్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు దెబ్బతీసి తమ జట్టును విజయంవైపు నడిపించారు. జింబాబ్వే బ్యాట్స్‌మన్ టేలర్ చేసిన శతకం ఆ జట్టుకు గెలుపును అందించలేకపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..