రాష్ట్రంలో కొత్తగా 3,224 కరోనా కేసులు, 32 మరణాలు నమోదయ్యాయి. మెుత్తం కరోనా కేసుల సంఖ్య 7,58,951కు చేరాయి. వైరస్‌తో ఇప్పటివరకు 6,256 మంది మృతి చెందారు. ప్రస్తుతం 43,983 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కరోనా నుంచి 7,08,712 మంది కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 61,112 కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు మెుత్తం 66.3 లక్షల మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిగాయి.