ETV Bharat / city

Ganja seized in Hyderabad: హైదరాబాద్​లో రూ.3 కోట్లు విలువైన గంజాయి పట్టివేత

author img

By

Published : Nov 25, 2021, 1:05 PM IST

Updated : Nov 25, 2021, 7:17 PM IST

Ganja seizedGanja seized in Hyderabad today
Ganja seizeGanja seized in Hyderabad todayd

13:04 November 25

Ganja seized in Hyderabad today

Ganja seized in Hyderabad today

Ganja seized in Hyderabad today: తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రంలో మత్తుదందాను పోలీసులు ఎక్కడికక్కడ చిత్తు చేస్తున్నారు. డ్రగ్స్‌ వ్యాపారులు, పాత నేరస్థులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఉక్కుపాదం మోపుతున్నారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో మరో రూ. 3 కోట్ల విలువైన 1,820 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ సీలేరు నుంచి మహారాష్ట్రకు లారీలో గంజాయి తరలిస్తుండగా... రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట్‌ వద్ద ఓఆర్​ఆర్​పై పోలీసులు పట్టుకున్నారు. మత్తు పదార్థాలను తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు రవాణాకు ఉపయోగించిన వాహనాలు లారీ, కారును స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ మేరకు ఘటన వివరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్​(Rachakonda cp mahesh bhagwat on ganja seized) మీడియా సమావేశంలో వెల్లడించారు.  

ఎరువులతో కప్పి

నిందితులు.. గంజాయి కిలో రూ. 8 వేలకు విశాఖలో కొని.. మహారాష్ట్రలో రూ. 15 వేలకు అమ్ముతున్నారని సీపీ(ganja seized in hyderabad) తెలిపారు. ఈ ముఠా నర్సీపట్నం, రాజమహేంద్రవరం, చౌటుప్పల్‌ ప్రాంతాల మీదుగా గంజాను షోలాపుర్‌కు తరలిస్తున్నట్లు వివరించారు. తమకు ముందుగా సమాచారం రావడంతో తనిఖీలు చేశామని చెప్పారు. నిన్న అర్ధరాత్రి గంజాయి తరలిస్తుండగా పెద్దఅంబర్‌పేట్ వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్‌పై స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. లారీ కింది భాగంలో గంజాయి ప్యాకెట్లు పెట్టి పైన కంపోస్టు ఎరువులతో కప్పారని వివరించారు. వారం క్రితం కూడా ఇలాగే 1200 కిలోల గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకున్నట్లు సీపీ పేర్కొన్నారు.  

పరారీలో ప్రధాన నిందితుడు

గంజాయి సరఫరా చేసింది ఎవరనే విషయాన్ని పరిశీలిస్తున్నామని సీపీ పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపిన సీపీ.. మహారాష్ట్రకు చెందిన లక్ష్మణ్‌ షిండే ఈ కేసులో ఏ1 గా ఉన్నాడని చెప్పారు. గంజాయి సరఫరాదారులందరిపైన పీడీ చట్టం ప్రయోగిస్తామని.. సరఫరాదారుల ఆస్తులను జప్తు చేస్తామని వివరించారు.  

విశాఖ నుంచి మహారాష్ట్రకు గంజాయి సరఫరా అవుతోంది. మాకు ముందుగా సమాచారం రావడంతో తనిఖీలు చేశాం. లారీ వెనక భాగంలో గంజాయి ప్యాకెట్లు పెట్టి పైన ఎరువులతో కవర్‌ చేశారు. నిన్న అర్ధరాత్రి గంజాయి తరలిస్తుండగా మేము పట్టుకున్నాం. సీలేరు ఏజెన్సీలో కొందరితో నిందితులకు పరిచయముంది. ఇప్పటివరకు 31 మంది నిందితులపైన పీడీ యాక్ట్‌లు నమోదు చేశాం.   -మహేశ్​ భగవత్​, రాచకొండ సీపీ

ఇదీ చదవండి:

AP Corona Cases : రాష్ట్రంలో కొత్తగా 183 కరోనా కేసులు, ఒకరు మృతి

Last Updated : Nov 25, 2021, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.