ETV Bharat / city

హైదరాబాద్​ పాతబస్తీలో మరో 20 మంది అరెస్టు, పలు ఆంక్షలు - MLA Rajasingh issue

MLA Rajasingh issue ఎమ్మెల్యే రాజాసింగ్​ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముందస్తు చర్యలో భాగంగా హైదరాబాద్​ పోలీసులు పాతబస్తీలో ఆంక్షలు విధించారు. రాత్రి 8 గంటలకే షాపులు మూయించారు.

old city
old city
author img

By

Published : Aug 24, 2022, 8:40 PM IST

Police imposed restrictions in old city: ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యల నేపధ్యంలో పాత బస్తీలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజాసింగ్​ను అరెస్ట్ చేయాలంటూ ఓ వర్గం పలు ప్రాంతాల్లో గత రాత్రి నుంచి ఆందోళనకు దిగింది. చార్మినార్‌, మదీన, చాంద్రయాణగుట్ట, బార్కాస్‌, సిటీ కాలేజ్‌ తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో రోడ్లపై చేరి రాజాసింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉదయం కొంతమంది ఆందోళనకారులను అరెస్టు చేసిన పోలీసులు తాజాగా మరో 20 మందిని షాలిబండ వద్ద అరెస్టు చేశారు.

భారీగా మోహరించిన పోలీసులు.. ఈ నేపథ్యంలో పాతబస్తీలోని పలుప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసులను మోహరించారు. నేర విభాగ అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ రోజు ఉదయం పత్తర్ ఘట్టి కార్పొరేటర్ సోహెల్ ఖాద్రి ఆధ్వర్యంలో షాలిబండలో ర్యాలీకి బయల్దేరగా పోలీసులు అడ్డకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళన చేస్తున్న 31మందిని ఆరెస్ట్ చేసి కంచన్ భాగ్ పీఎస్​కి తరలించారు. ఇదే సమయంలో మధ్యాహ్నం మొఘల్ పురాతో పాటు మీర్ చౌక్ ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు రావడంతో వాటిని నమ్మొద్దని పోలీసులు తెలిపారు. ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో సాయంత్రం ర్యాలీగా వచ్చిన 20 మంది ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.

పాతబస్తీలో ఆంక్షలు.. ఉదయం షాలిబండ ఆందోళన నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్​ను రంగంలోకి దింపారు. మీర్ చౌక్, చార్మినార్, గోషామహల్ జోన్ల పరిధుల్లో మొత్తం 360 మంది ఆర్‌ఏఎఫ్ బలగాలు విధుల్లో ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ పోలీసులతో కలిసి చార్మినార్ నుంచి ప్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్న సమయంలోనే మీర్ చౌక్ వద్ద ఈ ర్యాలీలో ఉన్న 20 మందిని అరెస్ట్ చేశారు. మరో వైపు తాజా పరిణామాల నేపథ్యంలో పాతబస్తీ సహా దక్షిణ మండలంలో మద్యం, పాన్ షాపులు, దుకాణాలు, హోటళ్లు రాత్రి 8గంటలకే మూసి వేయాలని పోలీసులు ఆదేశించారు. రాత్రి కూడా పోలీసు అదనపు బలగాలు పాత బస్తీ పరిసర ప్రాంతాల్లో పహారా కాయనున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.