ETV Bharat / city

జీహెచ్​ఎంసీ ఎన్నికలు తెచ్చిన తంటా... 14 మంది పోలీసులకు కరోనా

author img

By

Published : Dec 3, 2020, 9:31 PM IST

కరోనా మహమ్మారి ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్న వేళ తెలంగాణలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు... ఆదిలాబాద్​కు వైరస్​ను మోసుకొచ్చాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల బందోబస్తు విధుల్లో పాల్గొన్న 14 మంది పోలీసులకు కరోనా సోకడం కలకలం రేపుతోంది.

జీహెచ్​ఎంసీ ఎన్నికలు తెచ్చిన తంటా... 14 మంది పోలీసులకు కరోనా
జీహెచ్​ఎంసీ ఎన్నికలు తెచ్చిన తంటా... 14 మంది పోలీసులకు కరోనా

ఆదిలాబాద్​ జిల్లా నుంచి దాదాపు 400 మంది జీహెచ్​ఎంసీ ఎన్నికల విధులకు హాజరయ్యారు. వీరిలో 35 మందిలో 14 మందికి పాజిటివ్‌ నివేదికలు రావడం గుబులు రేపుతోంది. మిగిలిన వాళ్లకి పాజిటివ్‌ నివేదికలు వస్తాయోనన్న ఆందోళన నెలకొంది. ఎన్నికల విధులకు వెళ్లి వచ్చిన సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు గురువారం కరోనా నిర్ధరణ పరీక్షలు చేయటానికి వైద్య శాఖ స్థానిక ఖుర్శిద్‌నగర్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాట్లు చేసింది.

క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటు

పోలీసుల్లో 14 మందికి కరోనా పాజిటివ్‌ నివేదికలు వెలువడటంతో మిగిలిన వారు పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎన్నికల విధులు, ప్రచారానికి వెళ్లి వచ్చిన వారంతా నిర్ధరణ పరీక్షలు చేయించుకునేవరకు కుటుంబ సభ్యులకు దూరంగా... ఐసోలేషన్‌లో ఉండాలన్నారు.

ఇదీ చూడండి: పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.