విజయవాడలో కుల బహిష్కరణ కలకలం రేగింది. చిట్టినగర్ కొండపైనున్న 10 కుటుంబాలను కుల పెద్దలు వెలివేశారని బాధితులు ఆరోపించారు. పాతబట్టలకు.. స్టీల్ సామాన్లు విక్రయించి జీవనం సాగించే తమను అడిగినంత డబ్బు ఇవ్వలేదనే కక్షతో.. కుల పెద్దల ముసుగులో శ్రీను, దుర్గ వేధిస్తున్నారని వాపోయారు.
కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని విజయవాడ సీపీ కార్యాలయానికి వెళ్లారు. సీపీ లేకపోవటంతో మళ్లీ స్థానిక పోలీసుల వద్దకు వెళ్లారు.