తిరుపతి నగరంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటిని ముట్టడించడానికి భవన నిర్మాణ కార్మికులు, కార్మిక సంఘాల నేతలు యత్నించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం కేటాయించిన 450 కోట్ల నిధులను దారి మళ్లించారని ఆరోపిస్తూ కార్మికులు మంత్రి ఎదుట నినాదాలు చేశారు.
ఒక్కో కార్మికునికి తక్షణమే పదివేల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు చెప్పిన మాటలకు... అధికారంలోకి వచ్చాక చేసే పనులకు పొంతన లేకుండా జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి ఇంటికి భారీగా చేరుకున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
ఇదీ చదవండి:
వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం నిధులు విడుదల.. రైతుల ఖాతాల్లో 510 కోట్లు