ETV Bharat / city

ఒకరితో ప్రేమ... మరొకరితో పెళ్లి..! - తిరుపతి నేర వార్తలు

ప్రేమ పేరు చెప్పి రెండేళ్లు ఆ యువతితో చెట్టాపట్టాలేసుకొని తిరిగాడు. పెళ్లంటూ చేసుకుంటే అది నిన్నే అంటూ... ప్రేయసిని నమ్మించాడు. చివరకి వేరే యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ ప్రేమికుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది.

women on strike out side lover house
women on strike out side lover house
author img

By

Published : Feb 15, 2020, 4:59 PM IST

ఒకరితో ప్రేమ... మరొకరితో పెళ్లి..!

తిరుపతిలో ప్రేమ పేరుతో యువతిని మోసగించాడో యువకుడు. స్థానిక కొర్లగుంటకు చెందిన చంద్రమౌళి అనే యువకుడు బెంగళూరులో సాఫ్ట్​వేర్ ఇంజినీర్​గా ఉద్యోగం చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతితో రెండేళ్లుగా ప్రేమయాణం సాగించాడు. ఇప్పుడు వేరొకరితో పెళ్లి పీటలు ఎక్కేందుకు నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. తన ఫిర్యాదును పోలీసులు స్వీకరించడం లేదని యువతి ఆరోపించింది. చివరకు చేసేదేమి లేక స్నేహితులతో కలిసి కొర్లగుంటలోని ప్రియుడి ఇంటిముందు ధర్నా చేసింది. చంద్రమౌళి కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి పారిపోయారు.

ఇదీ చదవండి

ప్రేమించిందని కూతురుని కొట్టిన తండ్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.