తిరుపతి నగరంలోని 50 డివిజన్లలో ఉన్న 101 సచివాలయాల పరిధిలోని ప్రతి దుకాణాన్ని పరిశీలించి ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండేలా చూడాలని కమిషనర్ గిరీషా అన్నారు. యూజర్ చార్జీలు(USER CHARGES) వసూలు చేసే విషయంలో పలువురు శానిటరీ కార్యదర్శులు నిర్లక్షంగా ఉన్నారని.. అధికారులు ఆదేశాలను భేఖాతరు చేస్తూ సేవా రుసుముల వసూళ్లలో వెనుకబడ్డ ఐదుగురు శానిటరీ కార్యదర్శులను తక్షణం సస్పెండ్ చేస్తున్నట్లు కమిషనర్ ప్రకటించారు. తిరుపతి నగరంలో ప్రతి ఒక్క ఇంటి నుంచి.. ఇప్పటి వరకు వసూలు చేస్తున్న రూ. 20 ఛార్జీలను.. రూ. 40కి పెంచుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఇప్పటి వరకు రూ. 30 వసూలు చేస్తున్న ప్రాంతాల్లో రూ.60 ప్రతి నెల వసూలు చేయాలని కమీషనర్ ఆదేశించారు. దుకాణదారుల నుంచి కొత్తగా ప్రకటించిన ధరలను యూజర్ చార్జీలుగా వసూలు చేయాలని వెల్లడించారు.
ఇవీ చదవండి: