తిరుమల(Tirumala) శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సుబ్రహ్మణ్యన్, మంత్రి వేణుగోపాల్, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, సినీనటుడు రాజేంద్రప్రసాద్, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ పాల్గొన్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తిరుమల వేంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు.
'కరోనా సమయంలో ప్రజలు అనవసరంగా బయట తిరుగుతున్నారు. స్వీయ జాగ్రత్తలు పాటిస్తే కరోనా బారినపడే పరిస్థితి రాదు'- రాజేంద్రప్రసాద్
'మా' ఎన్నికల్లో పోటీ సహజమేనని సినీ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. ఎన్నికల తర్వాత అంతా ఒక్కటేనని స్పష్టంచేశారు.
"కుల ధ్రువీకరణ పత్రం అంశంపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. సుప్రీం స్టే ఇవ్వడంతో శ్రీవారి దర్శనం చేసుకున్నా. తెలుగు ప్రజల వల్లే నాకు పేరు వచ్చింది. తెలుగు ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నా. రైతులు, మహిళలు, యువతకు సహాయం చేస్తా. కరోనా ప్రభావం తగ్గి ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రార్థించా." - అమరావతి ఎంపీ, నవనీత్‌కౌర్
ఇదీ చదవండి: