తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ఆదిమూలం, సినీ నటుడు రజినీకాంత్ కుమార్తెలు సౌందర్య, ఐశ్వర్య, పీఠాధిపతి దత్త విజయానందతీర్థస్వామి.. స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రముఖులకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన తితిదే ఆధికారులు... దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఇదీ చదవండి: Atchannaidu on farmers: వైకాపా పాలనలో రైతులు అప్పులపాలు: అచ్చెన్న