ETV Bharat / city

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రముఖులు దర్శించుకున్నారు. ముంబై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దామా శేషాద్రి నాయుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాథ్‌, మాజీ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి, సినీ దర్శకుడు మారుతి.. స్వామివారి సేవలో పాల్గొన్నారు.

vips visit Tirumala temple in Chittoor district

author img

By

Published : Dec 29, 2020, 11:53 AM IST

Updated : Dec 29, 2020, 12:15 PM IST

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ముంబై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దామా శేషాద్రి నాయుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాథ్‌, మాజీ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి, సినీ దర్శకుడు మారుతీ స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కరోనా సమయంలో మంచి కథలు తయారు చేశానన్న మారుతీ.. నూతన సంవత్సరంలో స్టార్‌ హీరోలతో సినిమాలు చేయబోతున్నట్టు చెప్పారు.

గ్రేటర్‌ రాయలసీమ సాధన కోసం సంక్రాంతి తర్వాత యాత్ర చేపడతామని.. మాజీ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి వెల్లడించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. గ్రేటర్‌ కాంక్షతో రాసిన పుస్తకాన్ని స్వామివారి చెంత ఉంచి ఆశీర్వాదం తీసుకున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి:

'తాడిపత్రి ఘటన.. రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు సాక్ష్యం'

Last Updated : Dec 29, 2020, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.