తిరుమల శ్రీవారిని ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, తెలంగాణ ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ శంకర్ రాజు, చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, ఏపీ సమాచారశాఖ కమిషనర్ శ్రీనివాసరావు స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీరికి తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఇవీ చూడండి...