దీపావళి ఆస్థానం దృష్ట్యా నవంబర్ 4న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) ప్రకటించింది. నవంబర్ 3న వీఐపీ సిఫారసు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది.
మోహన్ పబ్లికేషన్స్ పై విజిలెన్స్ విచారణ..
దేవుళ్లు డాట్ కామ్ పేరుతో ఆన్‌లైన్‌లో.. తితిదే క్యాలెండర్, డైరీలను రాజమహేంద్రవరానికి చెందిన మోహన్ పబ్లికేషన్స్ విక్రయిస్తున్నట్లు తితిదే గుర్తించింది. ఈనెల 20 నుంచి ఆన్‌లైన్‌లో రూ.130 విలువైన క్యాలెండర్ రూ.243కి విక్రయిస్తున్నట్లు తితిదే దృష్టికి వచ్చింది. దాంతో ఈ వ్యవహారంపై తితిదే విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.
కాగా .. ఆన్‌లైన్‌లో తితిదే క్యాలెండర్, డైరీల విక్రయానికి అమెజాన్‌కు తితిదే అవకాశం కల్పించింది. రూ.130 విలువైన క్యాలెండర్ రూ.198కి విక్రయించుకోవడానికి అమెజాన్‌కు తితిదే అనుమతి ఇచ్చింది.
ఇదీ చదవండి: TIRUMALA: నవంబర్‌లో తిరుమల శ్రీవారి ఆలయంలో ఏం జరగనుందో తెలుసా?