ETV Bharat / city

తిరుమలలో ఈ నెల 22న కార్తీక వనభోజనాలు - తిరుమల తాజా వార్తలు

కార్తిక మాసం సందర్భంగా తిరుమలలో ఈ నెల 22న వనభోజనాలు నిర్వహించనున్నారు. స్థానికులకు, యాత్రికులకు సామూహికంగా అన్నప్రసాదాలను వడ్డిస్తారు.

vana bhojana's at tirumala on november 22
తిరుమలలో ఈ నెల 22న కార్తీక వనభోజనాలు
author img

By

Published : Nov 18, 2020, 2:16 PM IST

vana bhojana's at tirumala on november 22
తిరుమలలో ఈ నెల 22న కార్తీక వనభోజనాలు

తిరుమలలలో ఈ నెల 22వ తేదీన కార్తీక వనభోజన మహోత్సవాన్ని తితిదే నిర్వహించనుంది. ప్రతి ఏటా కార్తీకమాసంలో వనభోజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వనభోజనోత్సవంలో భాగంగా శ్రీ మలయప్పస్వామివారు గ‌జ వాహ‌నంపై, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు మరో ప‌ల్లకీపై ఆలయం నుంచి ఊరేగింపుగా పార్వేటమండపానికి వేంచేస్తారు. అక్కడ స్వామి, అమ్మవార్లకు స్నపనతిరుమంజనం, అభిషేకాలను నిర్వహిసారు. అనంతరం అటవీ ప్రాంతంలో కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహిస్తారు. స్థానికులకు, యాత్రికులకు సామూహికంగా అన్నప్రసాదాలను వడ్డిస్తారు.

కార్తిక వ‌న‌భోజ‌నం కారణంగా ఆ రోజు శ్రీవారి అలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారసేవలను తితిదే రద్దు చేసింది.

ఇదీ చదవండి:

ఫోన్​ చూస్తే తండ్రి తిడుతున్నాడని కుమారుడి కిడ్నాప్ డ్రామా...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.