తిరుపతిలోని శ్రీకోదండరామ స్వామివారి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉట్లోత్సవ ఆస్థానం జరిగింది. కొవిడ్-19 నిబంధనల మేరకు ఆలయంలో ఏకాంతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణులు, శ్రీకృష్ణస్వామి వారిని ముఖ మండపంలో ఆస్థానం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉభయదారులు, ఉభయాలు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో పార్వతి, ఏఈవో దుర్గరాజు, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ రమేష్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మూడు రాజధానుల అంశంపై స్టేటస్ కో కొనసాగింపు