తిరుపతి పట్టణాన్ని అవినీతిరహిత పట్టణంగా తీర్చి దిద్దుతానని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. తుడా ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించిన ఆయన... తిరుపతిలో పాలనను ప్రజలకు చేరువ చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానని తెలిపారు. తుడా పరిధిలోని అన్ని పల్లెలు, పట్టణాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ విజయరామరాజు శుభాకాంక్షలు తెలిపారు. తొలుత భాస్కర్ రెడ్డి మత పెద్దల ఆశీర్వచనాలు తీసుకున్నారు.
తుడా ఛైర్మన్గా చెవిరెడ్డి బాధ్యతల స్వీకరణ
తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(తుడా) ఛైర్మన్గా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. తిరుపతిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా ఆయన అన్నారు.