తిరుపతి పరిసర ప్రాంతాల్లోని 10 కిలోమీటర్ల పరిధిలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని... రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తితిదే ధర్మకర్తల మండలి తీర్మానం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మద్యపాన నిషేధంపై రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొంటున్న చర్యల్లో భాగంగా... తిరుపతిలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని కోరింది. తొలి విడతగా తిరుమలకు వెళ్లే ప్రధాన రహదారుల్లో మద్యం అమ్మకాలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేసింది. గత నెల 23న జరిగిన సమావేశంలో ప్రభుత్వాన్ని కోరుతూ చేసిన తీర్మానంలో కొంత మేర మార్పులు చేసింది. అలిపిరి నుంచి 2కిలోమీటర్ల మేర వెంటనే మద్యం అమ్మకాలపై నిషేధం విధించాలని కోరింది.
ఇదీ చదవండి : రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ మ్యాప్ విడుదల