ETV Bharat / city

'అన్యమత ప్రచారం' వార్తలపై తితిదే స్పందన - సప్తగిరి మాస పత్రిక వివాదం వార్తలు

సప్తగిరి మాస పత్రికతో పాటు అన్యమతానికి చెందిన పుస్తకం సరఫరా జరిగినట్లు వచ్చిన వార్తలపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. ఇది కొంతమంది దురుద్దేశపూర్వకంగా చేసిన చర్యగా భావిస్తున్నట్లు తెలిపింది. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని వెల్లడించింది.

ttd respond on Pagan propaganda
ttd respond on Pagan propaganda
author img

By

Published : Jul 6, 2020, 9:33 PM IST

గుంటూరుకు చెందిన ఓ పాఠ‌కుడికి స‌ప్త‌గిరి ఆధ్యాత్మిక పత్రికతో పాటు అన్య‌మ‌తానికి చెందిన మ‌రో పుస్త‌కం సరఫరా అయిన‌ట్లు వచ్చిన వార్తలపై తితిదే స్పందించింది. తితిదే ప్ర‌తిష్ఠను దెబ్బ తీసేందుకు కొంత మంది చేసిన దుశ్చర్య అని మండిపడింది. ఈ విషయంపై నిజాలు నిగ్గు తేల్చేందుకు పోలీసుల‌కు ఫిర్యాదు చేశామని తితిదే ఓ ప్రకటనలో తెలిపింది.

బాధ్యత తపాలా శాఖదే...

స‌ప్త‌గిరి మాస ప‌త్రిక ప్యాకింగ్, సరఫరా భాధ్య‌త మొత్తం తపాలా శాఖ‌దేనని తితిదే స్పష్టం చేసింది. ఇందుకోసం పోస్టేజీ ఛార్జీల‌తో పాటు ఒక్కో ప్ర‌తికి అద‌నంగా 1.05 రూపాయలను తితిదే చెల్లిస్తున్నట్లు వివరించింది. స‌ప్త‌గిరి మాస పత్రిక‌ను బుక్ పోస్టులో పంపుతున్నందున కవరుకు ఎలాంటి సీలు ఉండ‌దని స్పష్టం చేసింది.

దురుద్దేశపూర్వకమే...

అన్యమత పుస్తకాలు పంపిణీ అవుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ప‌లు జిల్లాల‌కు చెందిన స‌ప్త‌గిరి పాఠ‌కుల‌కు ఫోన్ చేసి విచారించామని తితిదే తెలిపింది. అన్య‌మ‌త పుస్త‌కం త‌మ‌కు అంద‌లేద‌ని ఖాతాదారులు చెప్పినట్లు వెల్లడించింది. గుంటూరు ఘటనను దురుద్దేశ చ‌ర్య‌గా భావిస్తున్నట్లు చెప్పింది.

సంబంధిత కథనం

తితిదే నుంచి శ్రీవారి భక్తునికి 'సువార్త' పుస్తకం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.