సంస్థ ఉద్యోగులందరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని తితిదే ఆరోగ్యాధికారి ఆర్.ఆర్.రెడ్డి సూచించారు. భక్తులతో నేరుగా సంబంధాలున్న 3 వేల మంది ఉద్యోగులకు ఇప్పటి వరకు టీకా వేశామని తెలిపారు. 45 ఏళ్లు దాటిన వారందరికీ రేపటి నుంచి టీకా పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం రెండు చోట్ల కరోనా టీకా వేస్తున్నామని ఆర్.ఆర్.రెడ్డి తెలిపారు. అవసరాన్ని బట్టి వ్యాక్సిన్ కేంద్రాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తానూ టీకా తీసుకున్నానని.. ఎవరూ భయపడకుండా వ్యాక్సినేషన్‌కు ముందుకు రావాలని కోరారు.
ఇదీ చదవండి: