అలిపిరి - చెర్లోపల్లి మార్గంలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, సైన్స్ సిటీ, ఎస్వీ శిల్ప కళాశాల తదితర ప్రాంతాలను జేఈవో సదాభార్గవి పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో చర్చించారు. విలువైన ఆస్థులు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తితిదే ఆస్తులుగా గుర్తించడానికి అవసరమైన బోర్డులు, సరిహద్దులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఖాళీ ప్రాంతాలు ఆక్రమణకు గురయ్యే ప్రమాదం ఉండటంతో క్రమం తప్పకుండా పర్యవేక్షించాలన్నారు.
ఇదీ చదవండి: