తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్లను తితిదే ఈ నెల 27న విడుదల చేయనుంది. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు ఉచిత సర్వదర్శనం టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతామని దేవస్థానం అధికారులు తెలిపారు. డిసెంబర్ కోటా టికెట్లను తితిదే వెబ్‌సైట్(TTD website)లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. వసతి గదులకు సంబంధించి డిసెంబర్ నెల కోటాను నవంబరు 28వ తేదీ ఉదయం 9 గంటలకు అందుబాటులో ఉంచనున్నారు. రెండు నెలలుగా సర్వదర్శనం టోకెన్లను ఆన్‌లైన్(Tickets issuing with online system) ద్వారా మాత్రమే తితిదే విడుదల చేస్తోంది.
ఇదీచదవండి.