భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్లే క్యూలైన్లను అధికారులతో కలసి ఈవో జవహర్‌రెడ్డి పరిశీలించారు. టిక్కెట్ల పరిశీలన, దర్శన మార్గాలను... వైకుంఠంలో భక్తులకు కల్పించే సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం అన్నప్రసాద వితరణ కేంద్రానికి చేరుకుని భక్తులతో కలసి మధ్యాహ్న భోజనం చేశారు. భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించిన ఈవో... సలహాలు, సూచనలు, ఫిర్యాదుల పుస్తకంలో తన అభిప్రాయాన్ని తెలుగులో రాశారు. పరిశుభ్రతతో కూడిన నాణ్యమైన భోజనం భక్తులకు అందుతుందన్నారు. అన్నప్రసాదం విభాగం సిబ్బందిని అభినందించారు. మరింత మెరుగ్గా భక్తులకు సేవలందించేందుకు కృషి చేస్తామన్నారు.
ఇదీ చదవండి: