ETV Bharat / city

'శాశ్వత ప్రాతిప‌దికన.. భ‌క్తుల‌కు సంప్రదాయ భోజనం అందిస్తాం..'

లాభాపేక్ష లేకుండా సంప్రదాయ భోజ‌నాన్ని భ‌క్తుల‌కు అందిస్తామ‌ని తితిదే ఈఓ జవహర్ రెడ్డి అన్నారు. తిరుమల అన్నమయ్య భవనం క్యాంటీన్​లో ప్రకృతి వ్యవ‌సాయ ఉత్పత్తుల‌తో వండిన సంప్రదాయ భోజ‌నాన్ని ఆయన స్వీకరించారు. ముడిప‌దార్థాల‌న్నీ సిద్ధం చేసుకుని శాశ్వత ప్రాతిప‌దికన అమ‌లు చేస్తామన్నారు.

ttd eo jawahar on serving of organic food at tirumala

author img

By

Published : Aug 27, 2021, 4:57 PM IST

తిరుమలలో సంప్రదాయ భోజ‌నం..

దాత‌ల స‌హకారంతో తిరుమ‌లలో సంప్రదాయ భోజ‌నాన్ని ప్రవేశ‌పెట్టేందుకు చర్యలు చేప‌ట్టామ‌ని తితిదే ఈఓ జవహర్ రెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనం క్యాంటీన్​లో ప్రకృతి వ్యవ‌సాయ ఉత్పత్తుల‌తో వండిన సంప్రదాయ భోజ‌నాన్ని ఆయన స్వీకరించారు. వారం రోజుల పాటు సంప్రదాయ భోజ‌నాన్ని ప్రయోగాత్మకంగా ప‌రిశీలిస్తున్నామన్నారు.

గో ఆధారిత వ్యవ‌సాయ ఉత్పత్తులతో త‌యారుచేసిన ఆహారంతో వ్యాధి నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంద‌ని, క‌రోనా స‌మ‌యంలో శాస్త్రవేత్తలు కూడా ఇలాంటి ఆహారంపై చ‌ర్చిస్తున్నార‌ని ఈఓ జవహర్ రెడ్డి తెలిపారు. ప‌ట్టణ‌వాసుల‌తో పోల్చుకుంటే గ్రామాల్లో స‌హ‌జసిద్ధంగా ల‌భించే ఆహారం తీసుకునే వారికి వ్యాధి నిరోధ‌క శ‌క్తి ఎక్కువ‌గా ఉంటుంద‌న్నారు. ఈ సందేశాన్ని ప్రజ‌ల్లోకి పంపడం, గో ఆధారిత వ్యవ‌సాయాన్ని ప్రోత్సహించ‌డం ద్వారా గోమాత‌ను ర‌క్షించుకోవ‌డం తితిదే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. లాభాపేక్ష లేకుండా సంప్రదాయ భోజ‌నాన్ని భ‌క్తుల‌కు అందిస్తామ‌ని, ముడిప‌దార్థాల‌న్నీ సిద్ధం చేసుకుని శాశ్వత ప్రాతిప‌దికన అమ‌లు చేస్తామన్నారు.

తిరుమల అన్నమయ్య భవనంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆహార వితరణ ప్రారంభించారు. వచ్చే నెల ఎనిమిది వరకు ఉచితంగా ఆహారాన్ని అందచేసి భక్తుల అభిప్రాయాలు, సూచనలు సేకరించనున్నారు. గోవుల ఉత్పత్తులతో గోవిందునికి గో ఆధారిత నైవేద్యం సమర్పిస్తున్న తితిదే.. ప్రకృతి వ్యవసాయంతో పండించిన పంటలతో అల్పాహారం, భోజనం భక్తులకు అందుబాటులోకి తెస్తోంది.

దేశీయ ఆవు నెయ్యి, బెల్లం, గానుగ నూనెతో వంట‌లు వండి భ‌క్తుల‌కు వ‌డ్డిస్తున్నారు. కుల్లకారు బియ్యంతో ఇడ్లీలు, కాలా బాత్ బియ్యంతో ఉప్మా త‌యారు చేసి అందించారు. మ‌ధ్యాహ్నం కొబ్బరి అన్నం, పులిహోర‌, పూర్ణాలు, ప‌చ్చి పులుసు, దోశ‌కాయ ప‌ప్పు త‌దిత‌ర 14 ర‌కాల వంట‌కాలు భ‌క్తుల‌కు అందించారు.

ఇదీ చదవండి:

WEATHER UPDATE: రాగల 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.