ETV Bharat / city

DEVOTEES PROBLEMS IN TIRUMALA : కాంట్రాక్టు కార్మికుల ఆందోళన.. భక్తులకు తప్పని ఇబ్బందులు - tirumala latest news

తిరుమలలో గదులు లభించక భక్తుల ఇబ్బందులు
తిరుమలలో గదులు లభించక భక్తుల ఇబ్బందులు
author img

By

Published : Dec 8, 2021, 11:06 AM IST

Updated : Dec 8, 2021, 12:22 PM IST

11:04 December 08

గదులను శుభ్రం చేయకపోవడంతో.. భక్తులకు కేటాయింపు నిలిపివేత

DEVOTEES PROBLEMS IN TIRUMALA : తిరుమలలో పారిశుధ్య ఒప్పంద కార్మికుల ఆందోళనతో.. తిరుమలలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తితిదే ఎఫ్‌ఎమ్‌ఎస్‌ సర్వీసెస్‌ ఆధ్వర్యంలో పనిచేసే కార్మికులు.. తమను తితిదే కార్పొరేషన్​లో కలపాలంటూ వారం రోజులుగా విధులు బహిష్కరించి, ఆందోళన చేస్తున్నారు. దీంతో.. పారిశుధ్య పనుల్లో ఇబ్బందులు తలెత్తాయి.

గుత్తేదారు సంస్థలు.. అరకొర కార్మికులతో గదులను శుభ్రం చేయిస్తున్నప్పటికీ.. పూర్తిస్థాయిలో పనులు జరగట్లేదు. ఈ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. గదులను శుభ్రం చేయకపోవడంతో.. భక్తులకు కేటాయించడాన్ని తితిదే ఈ రోజు నిలిపివేసింది.

ఇవాళ ఉదయం ఆరు గంటల నుంచి వేచి ఉన్నా.. ఇప్పటికీ గదిని కేటాయించలేదని, అడిగితే సరైన సమాధానం చెప్పే వారూ కరవయ్యారని భక్తులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదీచదవండి :

Last Updated : Dec 8, 2021, 12:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.