శ్రీవారి సేవకు వినియోగించిన పుష్పాలతో అగరబత్తీలు, అలంకరణ వస్తువులు తయారుచేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తితిదే నిర్వహణలో ఉన్న మూడు గోశాలల నుంచి సేకరించిన పంచగవ్యాలతో గృహావసర, సౌందర్య ఉత్పత్తులను రూపొందిస్తోంది. కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద ఫార్మసీ సాంకేతిక సహకారంతో 15 రకాల ఉత్పత్తుల్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈనెల 27 నుంచి పంచగవ్య ఉత్పత్తుల అమ్మకాలు ప్రారంభం కానున్నాయి
హెర్బల్ సోప్, ధూప్ చూర్ణం, అగరబత్తీ, హెర్బల్ షాంపు, హెర్బల్ టూత్ పౌడర్, విభూది, నాజిల్ డ్రాప్స్, హెర్బల్ ఫేస్ ప్యాక్, హెర్బల్ ఫ్లోర్ క్లీనర్, సాంబ్రాణి కప్, ధూప్ కోన్, ధూప్ స్టిక్స్, గో అర్కం, పిడకలు తదితర ఉత్పత్తుల్ని నమామి గోవింద పేరుతో విక్రయించనున్నారు. పంచగవ్య గృహ ఉత్పత్తులతో పాటు డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో తయారు చేసిన చిత్ర పటాలు వినియోగదారుల కోసం తితిదే సిద్ధంగా ఉంచింది.
ఇదీ చదవండి: Balakrishna: హిందూపురం కేంద్రంగా సత్యసాయి జిల్లా ప్రకటించాలి: బాలకృష్ణ
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!