ఓ ఏజెన్సీ కింద పనిచేస్తున్న 1300 మంది ఉద్యోగులను తితిదే తొలగించింది. దీంతో విధుల్లో ఉన్నవారు శ్రీనివాసం, విష్ణునివాసం వసతి సముదాయాల్లో ఆందోళనకు దిగగా... విధులకు హాజరయ్యేందుకు వచ్చిన వారు ప్రధాన ద్వారాల వద్ద నిరసన చేపట్టారు. శ్రీనివాసంలో 310 మంది, విష్ణునివాసం వద్ద 279 మంది ఆందోళన చేపట్టారు. ఈ కరోనా సమయంలో ఉద్యోగాల నుంచి తొలగిస్తే తాము ఏమవ్వాలి అంటూ ఒప్పంద ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
తితిదేకి సంబంధించిన వసతిభవనాలు, కార్యాలయాల్లో పారిశుద్ధ్య పనుల కోసం నియమించుకున్న పద్మావతి ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ గుత్తేదారు... సక్రమంగా పని చేయటం లేదనే ఆరోపణలతో దానిని తొలగిస్తూ గతంలో తితిదే పాలక మండలిలో తీర్మానం చేసింది. టెండర్లు పిలిచి కొత్త ఏజెన్సీని నియమించాలని ఆదేశించటంతో పాటు ప్రస్తుతం ఉన్న ఏజెన్సీకి ఏప్రిల్ 30వరకూ గడువును ఇచ్చింది. ఆ గడువు ముగియటంతో ఒప్పంద కార్మికులను తితిదే సిబ్బంది విధుల్లోకి అనుమతించలేదు.
ఇదీ చదవండి