తిరుమల అన్నమయ్య భవనంలో తితిదే ధర్మకర్తల మండలి సమావేశం ప్రారంభమైంది. తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన జరగుతున్న సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ఛైర్మన్‌తో పాటు సభ్యులు దామోదరరావు, మేడా మల్లిఖార్జునరెడ్డి, పార్థసారథి, చిప్పగిరి ప్రసాద్, చెవిరెడ్డి భాస్కరరెడ్డితో పాటు ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈఓ ధర్మారెడ్డి ఇతర ఉన్నతాధికారులు నేరుగా సమావేశంలో పాల్గొన్నారు. మిగిలిన సభ్యులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశానికి హాజరయ్యారు.
కరోనా కారణంగా రోజుకు 9 వేల మందికి మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్న తితిదే భక్తుల సంఖ్య పెంచే అంశంపై ఈ సమావేశంలో చర్చించనుంది. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణపై చర్చించనున్నారు. అధిక మాసం రావటంతో ఈ ఏడాది 2 బ్రహ్మోత్సవాలు జరగనుండగా... కరోనా నేపథ్యంలో భక్తులను అనుమతి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కొవిడ్ ప్రోటోకాల్ నిబంధనలపై సమావేశంలో చర్చించి బ్రహ్మోత్సవాలపై నిర్ణయం తీసుకోనున్నారు.
ఇవీ చదవండి..