ఇదీ చదవండి: తితిదే ఆస్తులు ఎట్టిపరిస్థితుల్లోనూ విక్రయించం: వైవీ సుబ్బారెడ్డి
తితిదే భూములపై శ్వేతపత్రం విడుదలకు బోర్డు నిర్ణయం - టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల వార్తలు
తితిదేకి చెందిన భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి నిర్ణయం తీసుకున్నారు. తితిదే ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గతంలో వివిధ దశల్లో విక్రయించిన, దురాక్రమణకు గురైన, అందుబాటులో ఉన్న ఆస్తుల సమగ్ర సమాచారంతో కూడిన శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని అధికారులకు సుబ్బారెడ్డి సూచించారు.
ttd board decided to release white paper on assets of ttd