తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులను పరిరక్షించాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసింది. రిటైర్డ్ జస్టిస్ శ్రీధర్‌రావు నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యులతో పరిరక్షణ కమిటీ వేశామన్న తితిదే...శ్రీవారి ఆస్తులను వెబ్‌సైట్‌లో పెట్టినట్లు ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది. బంగారు నగల వివరాలు వెబ్‌సైట్‌లో పెట్టాలని న్యాయవాది బాలాజీ కోరారు. దీనిపై స్పందించిన తితిదే...నగల వివరాలు ఆన్‌లైన్‌లో పెడితే సమస్యలు వస్తాయని వెల్లడించింది.
గతంలో జస్టిస్ జగన్నాథరావు అధ్యక్షతన కమిటీ వేశామన్న తితిదే...ఆ కమిటీ సూచనలను పాటిస్తున్నట్లు వివరించింది. తితిదే ఆస్తులను భవిష్యత్తులో అమ్మకానికి పెట్టబోమని స్పష్టం చేసింది.