తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలోని 23 ఆస్తులను వేలం ద్వారా విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారనే అంశంపై హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యంపై విచారణను వచ్చే వారానికి వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ప్రవీణ్‌కుమార్, జస్టిస్ రమేశ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ వాజ్యంపై విచారణ చేపట్టింది. ఆస్తుల విక్రయాల అంశంపై కొన్ని తీర్పులను సమర్పించేందుకు గడువు కావాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు.
ఇప్పటికే ఆస్తుల వేలం రద్దు చేసుకుంటూ తితిదే స్పష్టమైన నిర్ణయం తీసుకుందని.. ఈ విషయాన్ని కౌంటరులో పొందుపరిచామని స్టాండింగ్ కౌన్సిల్ డాక్టర్ మజ్జి సూరిబాబు ధర్మాసనం దృష్టికి తీసుకు వెళ్లారు. ఆస్తుల వేలం లేని విషయంలో వాయిదాలు కోరడం సబబు కాదని అన్నారు. పిటిషనర్ తన వాదనకు సంబంధించి గతంలోని తీర్పు పత్రాలను హైకోర్టుకు సమర్పించేందుకు గడువు ఇస్తూ... ఈ కేసును వచ్చే వారానికి వాయిదా వేశారు.
ఇవీ చదవండి: