- " class="align-text-top noRightClick twitterSection" data="">
- రఘురామ ఫిర్యాదుపై సీఐడీ స్పందన
ఎంపీ రఘురామ ఫోన్‌ను నిబంధనల ప్రకారమే సీజ్ చేశామని సీఐడీ అధికారులు తెలిపారు. దిల్లీ పోలీసులకు ఎంపీ రఘురామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు ఈ మేరకు వివరణ ఇచ్చారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'పీడియాట్రిక్ వార్డులు ఏర్పాటు చేయండి'
కొవిడ్ థర్డ్‌వేవ్ (Covid Third Wave) దృష్ట్యా చిన్నారుల కోసం రాష్ట్రంలో 3 కేర్ సెంటర్లు (care centers) ఏర్పాటు చేయాలని సీఎం జగన్ (cm jagan ) ఆదేశాలు జారీ చేశారు. మూడో వేవ్‌పై సమీక్షించిన ఆయన.. పలు కీలక సూచనలు చేశారు. ఒక్కో ఆస్పత్రికి రూ.180 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'ఆనందయ్య మందు' పంపిణీ ప్రారంభం
కృష్ణపట్నం ఆనందయ్య ఔషధం..కరోనాకు పని చేస్తుందని నమ్మేవాళ్లంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మందు పంపిణీ నెల్లూరు జిల్లా గొలగమూడిలో ప్రారంభమైంది. శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమం వద్ద ఇవాళ లాంఛనంగా పంపిణీ ప్రారంభించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- మహిళా లోకం అండగా ఉండాలి: అనిత
విశాఖలో లక్ష్మీఅపర్ణ అనే యువతిపై పోలీసుల తీరును తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఖండించారు. ఈ ఘటనపై హోం మంత్రి, డీజీపీ స్పందించాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'అందరికీ ఉచితంగా టీకా'
18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకా కేంద్రమే అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇందుకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను రూపొందించి, జూన్ 21 నుంచి సరికొత్త విధానం అమలు చేస్తామని ప్రకటించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'దీపావళి వరకు ఉచిత రేషన్'
గరీభ్ కల్యాణ్ అన్న యోజన ద్వారా పేదలకు అందిస్తున్న ఉచిత రేషన్ పథకాన్ని దీపావళి వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దీని ద్వారా 80 కోట్ల మంది పేదలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'అపార్థాలు తొలగిపోయాయి'
భారత్‌తో నేపాల్ బంధంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయాయని స్పష్టం చేశారు. కరోనా వేళ భారత్ మరింత సాయం అందించాలని పేర్కొన్నారు ఓలీ. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ట్విట్టర్లో మరో ఫీచర్
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విట్టర్ త్వరలోనే 'సూపర్ ఫాలోస్ ఫీచర్'ను ప్రారంభించనుంది. పదివేల మంది ఫాలోవర్స్ ఉన్న యూజర్లకు అదనపు ఆదాయం తెచ్చిపెట్టనున్న ఈ ఫీచర్ గురించి మరింత తెలుసుకోండి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- టెస్టుల్లో అత్యధిక సిక్స్‌ల వీరులు వీరే!
క్రికెట్లో ఓపిక, సహనానికి మరో పేరు టెస్టు ఫార్మాట్. అలాంటి ఆటలో పరుగులు సాధించాలంటే ఎక్కువగా సింగిల్స్, డబుల్స్‌తోనే సాధ్యం. మరి బౌండరీలు అంటే కష్టమనే చెప్పాలి. బ్యాట్స్‌మెన్ కూడా ఫోర్లు, సిక్సర్లకు కాస్త దూరంగానే ఉంటారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- సముద్రంలో చేపలా.. బికినీలో అలా!
ముద్దుగుమ్మ కియారా అడ్వాణీ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన త్రోబ్యాక్ వీడియో అలరిస్తోంది. ఇందులో చేపలా ఈదుతున్న ఈమె.. అభిమానుల్ని కన్నార్పకుండా చూసేలే చేస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.