తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి.. సాధారణ భక్తులతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సామాన్య ప్రజలతో కలిసి స్వామిసేవలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. కరోనా పరిస్థితుల్లో స్థానికులకు ప్రత్యేకంగా టిక్కెట్లు ఇవ్వాలన్న తన అభ్యర్థన మేరకు.. వైకుంఠ ద్వార దర్శన టోకెన్లను తితిదే జారీ చేసినట్లు వెల్లడించారు.
వైకుంఠ ద్వార దర్శనం కోసం స్థానికులకు జారీ చేసిన సర్వదర్శనం టోకెన్‌ను ఎమ్మెల్యే పొందారు. తనకు కేటాయించిన సమయానికి ఆలయానికి చేరుకుని.. సామాన్యుడిలా స్వామి సేవలో పాల్గొన్నారు. వైకుంఠ ద్వార ప్రదక్షిణ అనంతరం ఆలయం వెలుపలకు వచ్చి.. అన్నప్రసాద భవనానికి వెళ్లి భక్తులతో కలసి భోజనం చేశారు.
ఇదీ చదవండి: